రష్మిక.. సిమ్రన్.. తర్వాత మనమేనా? డీప్‌ఫేక్ బారిన పడొద్దంటే
09 November 2023
ప్రస్తుతం ఈ టెక్నాలజీ కారణంగా ప్రాణాలు తీసుకుంటోన్న చాలామంది యువతుల కథలే ఇందుకు ఉదాహరణలు. అందుకే జాగ్రత్త.
ఫాలోయర్లు పెరుగుతారు, తేలిగ్గా డబ్బులు సంపాదించొచ్చు అని ఇన్‌ఫ్లుయెన్సర్లు అవ్వడానికి పోటీ పడుతున్న అమ్మాయిలూ జాగ్రత్త!
లైకులొస్తాయని ఫొటోలు షేర్ చేసుకుంటూ పోతే.. అవి ఎవరి చేతిలోనైనా పడొచ్చు. కాబట్టి, పోస్ట్ చేసే ముందే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
తెలియని వాళ్ల రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయొద్దు. సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్‌లో పెట్టుకోండి. మీ ఊరు, సమాచారం ఏవీ తెలియకుండా సెట్టింగుల్లో మార్పులు చేసుకోండి.
అందుబాటులోకి వచ్చిన యాప్‌ల సాయంతో ఫొటోపై వాటర్‌మార్క్ వేసుకోండి. అప్పుడు మార్ఫింగ్ అవకాశాలు తగ్గుతాయి.
క్లిష్టమైన పాస్‌వర్డ్‌లనే పెట్టుకోండి. సోషల్‌మీడియా ఎకౌంట్లు ఒక్కోదానికి ఒక్కోటి పెట్టుకోవడం మేలు. టూ వే అథెంటికేషన్‌కి ప్రాధాన్యమిస్తే సురక్షితంగా ఉండొచ్చు.
ట్రెండ్ పేరుతో ప్రతిదానికీ హ్యాష్‌ట్యాగ్‌లను ఇచ్చుకుంటూ వెళ్లొద్దు.కంప్యూటర్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పనిసరి చేసుకోండి.
సిస్టమ్, మొబైల్ ఏదైనా.. ఉపయోగించడం పూర్తయ్యాక సోషల్ మీడియా ఖాతాల నుంచి లాగ్‌ఆఫ్ అయితే ఇంకా మంచిది, సురక్షితం కూడా!