గృహిణులూ.. ఆ వలలో పడొద్దు!

01 నవంబర్ 2023

గృహిణులే లక్ష్యంగా సాగుతున్న సైబర్‌ మోసాలెన్నో! అప్రమత్తంగా ఉంటే సులువుగానే బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు..

తెలియని లింకుల్లోకి వెళ్లకండి. సందేహముంటే బ్యాంకు లేదా ఆన్‌లైన్‌ సంస్థ ఏదైనా సరే.. అధికారిక వెబ్‌సైట్‌నే వాడండి.

బ్యాంకు ఖాతా తెరిచినప్పుడు ఇచ్చిన ఫోన్‌ నంబరు, ప్రస్తుతం వాడుతున్నదీ ఒకటేనా? లేదంటే వెంటనే అప్‌డేట్‌ చేయించుకోండి.

అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్‌ పెట్టొద్దు. తేలిగ్గా గుర్తుండిపోయేలా.. 1234, మీ పేరులో నాలుగక్షరాలు, పుట్టిన తేదీ వంటివీ పెట్టొద్దు.

మీకు గుర్తుండదనిపిస్తే ఎక్కడైనా రాసి ఉంచుకోండి పర్లేదు కానీ.. పెద్దగా ఉన్న పాస్‌వర్డ్‌లే పెట్టుకోండి.

గుర్తుంటాయని సిస్టమ్‌, ఫోనుల్లో బ్యాంకు లాగిన్‌ వివరాలను సేవ్‌ చేస్తున్నారా? మీ సొంత పరికరాలే అయినా సైబర్‌ వలలో చిక్కే ప్రమాదమెక్కువ.

బ్యాంకు వాళ్లని చెప్పినా సరే.. లాగిన్‌ వివరాలు, పాస్‌వర్డ్‌, ఓటీపీ, సీవీవీ మొదలైనవేవీ చెప్పొద్దు. మీ బదులు మేం రిమోట్‌గా చేస్తాం అంటే అనుమతించొద్దు.

వెంటనే బ్యాంకు కస్టమర్‌ కేర్‌ని సంప్రదించి అకౌంట్‌ బ్లాక్‌ చేయండి. ఇంకా సైబర్‌ క్రైమ్‌ విభాగానికి 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి.