మీ ఫోన్‌ పోయిందా? వెంటనే ఇలా చేయండి..

27 September 2023

మీ ఫోన్‌ పోయిందా? సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు మస్ట్‌! వెంటనే ఇలా చేయడం వల్ల సైబర్‌ నేరాలు నివారించవచ్చు.

ఫోన్‌ దొంగిలించిన వ్యక్తి వెంటనే దాన్ని స్విచ్చాఫ్‌ చేయడం రివాజు. లొకేషన్‌ ట్రేస్‌ చేస్తారని ఆ పని చేస్తారు.

ద సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్‌) ఏర్పాటు చేసిన టెలి కమ్యూనికేషన్‌ విభాగం పోయిన ఫోన్ల రికవరీలో పోలీసులకు సహాయకారిగా ఉంది.

అన్ని ఫోన్ల ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఏమ్‌ఈఐ) డేటా బేస్‌తో లింక్‌ అవుతూ.. ఈ విస్తృత నెట్‌వర్క్‌లో ఫోన్‌ జాడ కనుక్కోవడం చాలా తేలిక.

ఫోన్‌ పోగానే దగ్గర్లోని పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. స్టేషన్‌లో పోలీసులు ఫోన్‌ను ట్రాక్‌ చేస్తారు.

ఫోన్‌ ఐఎమ్‌ఈఐ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఫోన్‌ ఎక్కడుందో తెలుసుకోవడంతోపాటు పోయిన ఫోన్‌ను బ్లాక్‌ చేయవచ్చు.

ఎఫ్‌ఐఆర్‌ కాపీ గానీ, ఫోన్‌ పోయినట్టుగా మరేదైనా గుర్తింపు పత్రంగానీ తీసుకోవాలి. దాని సాయంతో మీ పాత నంబర్‌తో డూప్లికేట్‌ సిమ్‌ తీసుకోవచ్చు.

ఫోన్‌ పోయినప్పుడు అందులోని సమాచారం చోరుల చేతికి చిక్కకుండా వెంటనే సమాచారం తుడిచేసే అవకాశమూ ఉంది.