సక్సెస్ సంబరాల్లో సలార్ టీం.. జపాన్ లో విడుదలకు సిద్ధం..

TV9 Telugu

09 January 2024

ఇటీవల అమెరికాలోని పోర్ట్‌లాండ్ విమానాశ్రయం నుంచి అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 మాక్స్‌ ఫ్లైట్‌ టేకాఫ్‌ అయ్యింది.

ఆ విమానం గాలిలో ఉండగా ఒక డోర్‌ ఊడిపోయి ఎగిరిపోయింది. సీటు బెల్ట్‌తో ఉన్న అందులోని 177 మంది ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు.

చివరకు ఆ విమానం అదే ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

విమానం గాలిలో ఉండగా డోర్‌ ఊడిపోయినప్పుడు దాని పక్క సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్‌ ఫోన్లు, బ్యాగులు, కొన్ని వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి.

అలా ఎగిరిపోయిన ఒక ఐఫోన్‌ 16,000 అడుగుల ఎత్తు నుంచి భూమిపై పడింది. పోర్ట్‌లాండ్‌లోని బర్న్స్ రోడ్‌లో దాన్ని గుర్తించారు.

సగం బ్యాటరీ ఛార్జ్‌ ఉన్న ఆ ఐఫోన్‌ చెక్కుచెదరలేదు. 16,000 అడుగుల ఎత్తు నుంచి నేలపై పడినప్పటికీ చక్కగా పని చేస్తుంది.

ఐఫోన్ మోడల్ ఏమిటన్నది నిర్థారణ కాలేదు. ఐఫోన్ 14 ప్రో లేదా ఐఫోన్ 15 ప్రో కావచ్చని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అంత ఎత్తు నుంచి కింద పడిన కూడా ఈ ఐఫోన్‌కి ఎలాంటి డ్యామేజ్‌ కాకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.