ఆన్‌లైన్‌లో చాటింగ్ పేరిట అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ తెగబడుతున్నారు సైబర్ కేటుగాళ్లు.
ఇంటర్‌నెట్, సోషల్ మీడియాపై ఉన్న క్రేజ్ నట్టింట్లో విషాదాన్ని నింపుతోంది. హడలెత్తిస్తున్న సోషల్ మీడియా వేదికగా పెరుగుతోన్న సైబర్ క్రైమ్స్.
చాటింగ్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న పోకిరీలు. ఫ్రెండ్లీ రిక్వెస్ట్‌తో ఫోటోలు తీసుకొని వాటిని మార్పింగ్ చేసి బెదిరింపులకు దిగతున్న నిందితులు.
అమ్మాయిల ప్రవర్తనలో మార్పు పసిగట్టిన పేరెంట్స్.. ఏంటని ఆరా తీస్తే, అమ్మాయిల విషయంలో బయటపడుతున్న అసలు నిజాలు.
అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ చేసి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు.
అపరిచితులతో చాటింగ్ అనర్ధానికి దారి తీస్తుందంటున్నారు. తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఫోటోలు, వీడియోలు పంపొద్దంటున్న పోలీసులు.
అమ్మాయిలు ఎవరికైనా సరే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను షేర్ చేయొద్దని సూచిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వీడియోలకు తప్పని సరిగా సెక్యూరిటీ లాక్ ఏర్పాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు వారి స్నేహాలపై ఓ కన్నేసి వుంచాలి.