వన్‌ప్లన్ పాడ్ గో పేరుతో ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే అధికారికంగా ఈ ట్యాబ్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించనుంది.
ఈ ట్యాబ్లెట్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అలాగే ఈ ట్యాబ్‌లో 9510 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇవ్వనున్నారు.
మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ పాడ్‌కి అప్‌డేట్‌గా ఈ కొత్త ట్యాబ్లెట్‌ను తీసుకురానున్నారు. వన్‌ప్లస్ ట్యాబ్ గత ఏప్రిల్‌లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
వన్‌ప్లన్ పాడ్ గో పేరుతో ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే అధికారికంగా ఈ ట్యాబ్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించనుంది.
ఈ ట్యాబ్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 37,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 39,999గా నిర్ణయించారు. ప్రస్తుతం రానున్న లేటెస్ట్ వెర్షన్ ధర వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక వన్‌ప్లస్ పాడ్ ట్యాబ్లెట్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11.61 ఇంచెస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే సొంతం.
ఈ ట్యాబ్లెట్‌లో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందిచారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
వన్‌ప్లస్ పాడ్ గోలో ఇంతకు మించిన ఫీచర్లను అందించనున్నట్లు సమాచారం. అయితే ధర, ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే ధర విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోతుండొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల చివరి నాటికి ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.