లుక్స్‌తోనే అదరగొడుతున్న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్

17 October 2023

మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్.

అక్టోబర్ 19న భారతదేశంలో వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వన్‌ప్లస్.

వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్ మొబైల్ మొదటిసారిగా క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చేతిలో కనిపించింది.

ఈ మొబైల్ ఫోల్డ్ చేసినప్పుడు ఎలాంటి గ్యాప్ లేకుండా ఓపెన్, క్లోజ్ చేయగల బుక్ లాంటి డిజైన్‌తో రూపొందించారు.

వన్‌ప్లస్ ఓపెన్ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే.. భారత్‌లో దాదాపు రూ.1,39,999గా ఉండొచ్చంటున్నారు నిపుణులు.

అక్టోబరు 27 నుంచి దేశవ్యాప్తంగా వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా.

వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్ మెయిన్ డిస్‌ప్లే చైనీస్ సెమీకండక్టర్ డిస్‌ప్లే టెక్నాలజీ కంపెనీ BOE తయారు చేసింది.

2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో హై పర్ఫామెన్స్ ఉంటుందన్నదీ టాక్.

ఫోన్ బ్యాక్‌సైడ్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్. 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 64-మెగాపిక్సెల్ జూమ్ కెమెరా, 48-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా.