TV9 Telugu

కోడింగ్‌కు కాలం చెల్లిన‌ట్టే..ఏఐపై ఎన్‌విడియా సీఈవో కీల‌క వ్యాఖ్య‌లు

27 Febraury 2024

ప్రస్తుతకాలంలో ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) వృద్ధి చెందుతుంది. ఇది అన్న రంగాల్లో ఆధిపత్యాన్ని చూపుతుంది.

ఏఐ ప‌లు అవ‌కాశాల‌ను సృష్టిస్తుంద‌ని కొందరు చెబుతుండ‌గా, ల‌క్ష‌లాది కొలువులు క‌నుమరుగ‌వుతాయ‌ని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు.

ఎన్‌విడియా సీఈవో జెన్స‌న్ హువంగ్ కూడా జాబ్ మార్కెట్‌పై ఏఐ ప్ర‌భావం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. లేటెస్ట్ టెక్నాల‌జీతో ఎవ‌రైనా ప్రోగ్రామ‌ర్ అవుతార‌ని అన్నారు.

రాబోయే రోజుల్లో పిల్ల‌లు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ శిక్ష‌ణతో నైపుణ్యాల‌ను అల‌వ‌రుచుకోవాలని పిలుపు ఇచ్చారు.

ఓ ద‌శాబ్ధం కింద‌ట ప్ర‌తి ఒక్క‌రూ కోడింగ్ నేర్చుకోవాల‌ని చెబుతుండేవార‌ని, కానీ ఇప్పుడు ప‌రిస్ధితి పూర్తిగా తారుమారైంద‌ని అన్నారు

ఏఐ రాక‌తో ప్ర‌తి ఒక్క‌రూ ప్రోగ్రామ‌రేన‌ని, పిల్ల‌లు కోడింగ్ ఎలా చేయాల‌ని నేర్చుకోవాల్సిన ప‌ని లేద‌ని అన్నారు.

ప్రోగ్రామింగ్ భాష మాన‌వీయంగా ఉండేలా క్రియేట్ చేయ‌డం త‌మ బాధ్య‌త‌ని ఇది ఏఐ సృష్ఠించిన అద్భుతమ‌ని ప్ర‌శంసించారు.

ప్ర‌జ‌లు ఏం చెప్ప‌ద‌లుచుకున్నార‌నేది కంప్యూట‌ర్ అర్ధం చేసుకునే క్ర‌మంలో ఇక సీ++, జావా వంటి కోడింగ్ భాష‌ల అవ‌స‌రం ఎంత మాత్రం లేద‌ని అన్నారు.