ఇక వెబ్ వాట్సాప్ నుంచి స్టేటస్ అప్‌డేట్ చేయొచ్చు..!
28 December 2023
TV9 Telugu
ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్‌ని అప్‌డేట్ చేసుకోవడంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది.
వాట్సాప్ స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతుంది. ఈ బీటా వెర్షన్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.
ప్రస్తుతం కేవలం మొబైల్‌లోనే మాత్రమే మనకి నచ్చిన వాట్సాప్ స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు కొత్త ఫీచర్‌లో యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్‌లో ఒకే అకౌంట్‌ను లాగిన్ చేసుకునే వీలుంటుంది.
ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్‌ను షేర్ చేసే అవకాశం ఉంది.
అప్‌డేట్ అందరికీ అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్ స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం రానుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ను మొదట ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది వాట్సాప్ మాతృ సంస్థ బీటా.
అయితే ఈ ఫీచర్ ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందో తెలియాల్సి ఉంది. ఇది ఎప్పటినుంచి వస్తుందో అనే వాట్సాప్ యూజర్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి