మార్చి 5న భారత్ మార్కెట్లోకి మిడ్ రేంజ్ నథింగ్ ఫోన్ 2ఏ.. ధర ఎంతంటే

20 February 2024

TV9 Telugu

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ తన మిడ్ రేంజ్ నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.

స్మార్ట్‌ ఫోన్‌

నథింగ్ ఫోన్2 కంటే ఈ ఫోన్‌ తక్కువ ధరకే లభిస్తుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ ధర రూ.30 వేల నుంచి ప్రారంభం కావచ్చునని తెలుస్తుంది.

 ధర

నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కు సంబంధించి వివరాలు లీక్‌ అయ్యాయి.

డిస్‌ప్లే

సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ ఆధారంగా పని చేస్తుంది.

వీడియో కాల్స్‌

డ్యుయల్ రేర్ కెమెరా సెటప్. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా.

 డ్యుయల్ రేర్ కెమెరా

జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్, 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

రెండు వేరియంట్లు

నథింగ్ ఫోన్2 స్మార్ట్‌ ఫోన్‌ 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై.

ఫాస్ట్ చార్జింగ్

అలాగే జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూ టూత్, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్, ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

టైప్‌ సీ ఛార్జింగ్‌ పోర్ట్‌