మళ్లీ భారత్ మార్కెట్లోకి నోకియా 3210 4జీ.. చౌకైన ధరల్లోనే లభ్యం!

12 June 2024

TV9 Telugu

ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. తన 'నోకియా' బ్రాండ్‌పై 'నోకియా 3210 4జీ (2024)' ఫోన్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. 

నోకియా

25 ఏండ్ల క్రితం 1999లో మార్కెట్లోకి వచ్చిన ఇదే ఫోన్‌ తాజాగా నోకియా అభిమానులను ఆలరించేందుకు సిద్ధమైంది.

25 ఏండ్ల క్రితం 

ఈ ఫోన్ ధర 3,999 రూపాయలుగా నిర్ణయించింది హెచ్ఎండీ గ్లోబల్. ఈ ఫోన్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్ ధర రూ.3,999

ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్, హెచ్ఎండీ ఈ-స్టోర్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్

వై2కే గోల్డ్, స్కూబా బ్లూ, గ్రుంజ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లేతో వస్తున్న నోకియా 3210 ఫోన్ యూనిసోక్ టీ 107 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 

నోకియా 3210

2 -మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కలిగి ఉంటుంది. 64 ఎంబీ ర్యామ్ అండ్ 128 ఎంబీ స్టోరేజీ కెపాసిటీ.

కెమెరా

ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో అదనంగా 32 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకునే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది.

మైక్రో ఎస్డీ కార్డు

1450 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో 9.8 గంటల టాక్ టైం ఉంటుంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

బ్యాటరీ