ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ యాప్ కొత్త ఫుచర్స్ తో ఆకట్టుకుంటుంది. మరోసారి సరికొత్త ఫుచర్స్ తో ముందుకు వస్తోంది.
ఇప్పటివరకు మెసేజ్‌లు, వాయిస్, వీడియో కాల్స్‌కు పరిమితమైన వాట్సాప్ తన పరిధిని మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది.
వాట్సాప్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్‌ను రూపొందించింది. రాబోయే కొత్త ఫీచర్ గురించి తాజాగా మెటా సిఇఒ మార్క్ జుకర్ బర్గ్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
భారత సహా 150కి పైగా దేశాల్లో మెటా కంపెనీ కొత్త వాట్సాప్ ఛానెల్స్ ప్రారంభించినట్లు ప్రకటన. ఈ వాట్సాప్ ఛానెల్స్ నుంచి సెలబ్రెటీలు, క్రికెటర్లు, హీరోలు, బిజినెస్ మెన్లను ఫాలో అవ్వొచ్చు.
తమ అభిమాన నటులు, స్పోర్ట్స్ స్టార్లు, ఫేమస్ క్రియేటర్ల ఛానెళ్లను వాట్సాప్ యూజర్లు నేరుగా సెర్చ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పటికే చాలా మంది స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ స్టేటస్ స్థానంలో అప్డేట్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది.
వాట్సాప్ నుంచి అప్డేట్లు పొందాలనుకునే వారు అధికారిక వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వొచ్చు. ఇలా చేస్తే ఈ అప్డేట్ మీకు లభిస్తుంది.
ఈ ఫీచర్ ఇప్పటికే టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. తాజాగా వాట్సాప్ లో ‘అప్డేట్స్’పేరుతో అందుబాటులోకి వచ్చేసింది.