ఏఐతో అందుబాటులోకి వ‌చ్చే స‌రికొత్త కొలువులివే..

20 September 2023

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతోంది. హ్యూమనాయిడ్‌ రోబోలను చట్ట సభలకు పంపించేందుకు.. కొన్ని దేశాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రాక‌తో ప్రపంచంలో ఏఐ టూల్స్‌పై హాట్ డిబేట్ సాగుతోంది. టెక్నాలజీ ప్రపంచంలో చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్స్‌కు సంబంధించి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

ఏఐ టూల్స్‌తో కొత్త టెక్నాల‌జీ జత కలిసి స‌రికొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఏఐ టూల్స్‌తో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నట్లు లార్జ్ లాంగ్వేజ్ మోడ‌ల్స్ అండ్ జాబ్స్ పేరిట వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం సర్వేలో వెల్లడించింది.

కృత్రిమ మేధస్సు యుగంలో ట్రైన‌ర్లు, ఎక్స్‌ప్లెయిన‌ర్లు, స‌స్టెయిన‌ర్లు అనే మూడు విభాగాల్లో స‌రికొత్త రోల్స్ అందుబాటులో రానున్నాయి.

ట్రైనింగ్ విభాగంలో పెద్ద సంఖ్యలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉపాధి అవ‌కాశాల‌ను క్రియేట్ చేస్తుందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.

లార్జ్ లాంగ్వేజ్ మోడ‌ల్స్‌ను అభివృద్ధి చేసే క్రమంలో ఇంజ‌నీర్లు, సైంటిస్టుల‌కు విస్తృత అవ‌కాశాలు ల‌భిస్తాయంటోంది WEF.

ట్రెడిష‌న‌ల్ ప్రోగ్రామింగ్ రోల్స్ స్ధానంలో క‌స్టమ్ మైక్రోచిప్స్‌కు డిమాండ్ పెరిగేకొద్దీ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజనీర్లకు సరికొత్త అవ‌కాశాలు అందివ‌స్తాయి.