ఏప్రిల్‌ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న స్మార్ట్‌ ఫోన్లు ఇవే..!

31 March 2024

TV9 Telugu

Samsung Galaxy M55 వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. త్వరలోనే లాంచింగ్‌కు సిద్ధమైన ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 

శాంసంగ్‌

ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌, 256 బీజీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ రూ. 30 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ర్యామ్‌

Realme GT 5 Pro: చైనాకు చెందిన రియల్‌మీ రియల్‌మ్‌ జీటీ 5 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ ఫోన్‌లో 5400 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. 

రియల్‌మీ

100 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్ చేయనుంది. 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. ధర విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఛార్జింగ్‌

OnePlus Nord CE 4: లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్న వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్‌ ఒకటి. ఏప్రిల్‌ మొదటి వారంలో లాంచ్‌ చేయనున్నారు.

వన్‌ప్లస్‌

ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 1.5 కే రిజల్యూజన్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. ధర రూ.27 వేలుగా ఉండొచ్చు.

ప్రాసెసర్‌

ఈ నెలలో అందుబాటులోకి వస్తున్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో మోటో ఎడ్జ్‌ 50 ప్రో ఒకటి. ఈ ఫోన్‌ను ఏప్రిల్‌లో లాంచ్‌ చేయనున్నారు. 

మరో బెస్ట్‌ ఫోన్‌

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌ను మే నెలలో లాంచ్‌ చేయనున్నారు. ఇందులో గూగుల్‌ ఏఐ ఫీచర్లను అందించనున్నారు.

గూగుల్‌ ఫోన్‌