ఈ ఏడాది వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్లు ఇవే!
06 September 2023
ఈ ఏడాది వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్లు ఇవే!
మెటా సంస్థ ఈ ఏడాది వాట్సాప్‌కు సంబంధించి ప్రత్యేక అప్డేట్స్‌ను పరిచయం చేసింది. 2023లో 7 ప్రధాన ఫీచర్లను తీసుకువచ్చింది వాట్సాప్ యాప్.
ముఖ్యంగా చాట్ లాక్, HD ఫోటోలు, ఎడిట్ బటన్, స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్లను అందుబాటులో తీసుకువచ్చింది.
పర్సనల్ చాట్‌లను లాక్ చేసుకునే సామర్థ్యాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. మీరు పంపిన వాట్సాప్ మెసెజ్‌లను ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకునే అప్షన్ తీసుకువచ్చింది.
తమ ఫోన్‌లో ఉండే కాంటాక్ట్‌లకు అధిక నాణ్యత కలిగిన HD క్వాలిటీ ఫోటోలను పంపించడానికి ఆప్షన్ తీసుకువచ్చింది.
మరి ముఖ్యంగా వాట్సాప్ యూజర్స్ తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను యాప్‌లో చూపించకుండా ఎంచుకునే ఆప్షన్ తీసుకువచ్చింది.
మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వాట్సాప్ లో కాల్ చేసే సదుపాయాన్ని పరిచయం చేసింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్.
ఫోన్ నుండి QR కోడ్ స్కాన్ చేయండి ద్వారా ఒకే వాట్సాప్ ఖాతాను ఫోన్ తోపాటు డెస్క్‌టాప్ డివైస్సుల్లోనూ ఉపయోగించే అవకాశం.
వాట్సాప్ వీడియో కాల్ చేసే టైమ్‌లో ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడానికి అనుమతిస్తూ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.