లొకేషన్ షేరింగ్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడో న్యూ ఫీచర్.. 

TV9 Telugu

04 January 2024

చాలామంది తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగిస్తున్నారు. దీని సాయంతో తెలియని ప్రదేశాలకు కూడా ఈజీగా వెళ్లొచ్చు.

గూగుల్ అందించే రియల్ టైం లొకేషన్ షేర్ చేయాలంటే తప్పనిసరిగా వాట్సాప్‌ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే.

ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులకు తెర దించుతూ గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్ సంస్థ.

తాజాగా వచ్చిన ఈ ఫీచర్ సాయంతో ఏ ఇతర యాప్స్ లేకుండా కేవలం సాధారణ మెసేజ్ తో రియల్ టైం లొకేషన్ షేర్ చేయొచ్చు.

వాట్సాప్‌లో రియల్ టైం లొకేషన్ మెసేజ్ పంపే ఫెసిలిటీలో 15 నిమిషాలు, 8 గంటలు సదరు లొకేషన్ షేర్ అవుతుంది.

కొత్తగా వచ్చిన ఫీచర్‌లో లొకేషన్ లిమిట్ ఆప్షన్ ఉండొచ్చు. వద్దనుకున్నప్పడు షేరింగ్ ఆప్షన్ నిలిపేయొచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల్లో చాలా మంది వాట్సాప్ యాప్ వాడరు. అటువంటి వారికి ఈ ఫీచర్ చాలా బాగా సహాయపడుతుంది.

మీరు లొకేషన్ షేర్ చేయాలన్నా సంబంధిత వ్యక్తి ఫోన్‌లో గూగూల్ మ్యాప్స్ లో లాగిన్ అయి ఉండాలి. అప్పుడు ఇది పని చేస్తుంది.