ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ ఏదీ..?
TV9 Telugu
12 June 2024
ఈరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలకు ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం హాబీగా మారిపోయింది.
అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ ఏది అని మీరు ఊహించగలరా ? ఈ ఖరీదైన ఫోన్ ధర కోట్లలో ఉండడమే పెద్ద విషయం.
ఈ ఫోన్‌ను తాయారు చేయడానికి బంగారం, వజ్రాలు కూడా ఉపయోగించారు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ ధర అంత ఎక్కువగా ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఏంటంటే ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్ అనే ఫోన్.
ఈ ఫోన్ ధర అక్షరాల 48.5 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దీని ధర సుమారు రూ. 395 కోట్లు అని అర్ధం.
ఈ ఐఫోన్‌ను 24 క్యారెట్ల బంగారం, గులాబీ పూత బంగారంతో అలంకరించారు. అలాగే దీనికి ప్లాటినం పూత పూయడం జరిగింది.
ఈ ఖరీదైన ఐఫోన్ ఆరెంజ్, డైమండ్, గోల్డ్ వేరియంట్‌లలో వస్తుంది. ఏ రంగు నచ్చితే ఆ రంగు మొబైల్ తీసుకోవచ్చు అన్నమాట.
ఈ ఫోన్ లు ప్రస్తుతం మార్కెట్ లో కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డిమాండ్ బట్టి మరిన్ని విడుదల చేయనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి