ఇక విండోస్ నుంచి వర్డ్‌ప్యాడ్ ఔట్..
TV9 Telugu
10 January 2024
కంప్యూటర్, లాప్ టాప్స్ లో ఉపయోగిస్తున్న విండోస్ తర్వాతి వెర్షన్ల నుంచి వర్డ్‌ప్యాడ్ తొలగించాలని నిర్ణయం తీసుకుంది విండోస్.
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన వర్డ్‌ప్యాడ్ సేవల్ని నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించినట్టు ‘విండోస్ ఇన్‌సైడర్ బ్లాగ్’ తాజాగా కథనంలో పేర్కొన్నది.
విండోస్ ఆపరేటింగ్-1995తో కంప్యూటర్లు, లాప్ టాప్ లో మొదలైన వర్డ్‌ప్యాడ్ సేవలు 28 ఏళ్లుగా కొనసాగుతూ ఉన్నాయి.
ప్రత్యామ్నాయంగా మైక్రోసాఫ్ట్ వర్డ్, విండోస్ నోట్‌ప్యాడ్‌లను అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘వర్డ్‌ప్యాడ్’ అవసరం తగ్గింది.
దీంతో తదుపరి విండోస్ వెర్షన్ల నుంచి వర్డ్‌ప్యాడ్‌ను పూర్తిగా తొలగించనుంది ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్.
ఇకపై అప్లికేషన్‌ను రీ-ఇన్‌స్టాల్ చేయటం కుదరదని అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది.
దీంతో విండోస్ లో వర్డ్‌ప్యాడ్ ఉపయోగిస్తూ కొత్త వెర్షన్ కి అప్డేట్ చేసికొందాం అనుకొనేవాళ్ళకి షాక్ తగిలినట్లైంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి