విక్రమ్‌ను ఫోటోలు తీసిన లూనార్ ఆర్బిటర్

15 September 2023

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పంపి విక్రమ్ ల్యాండర్.. నింగిని చీల్చుకుంటూచందమామపై వాలిన చంద్రయాన్‌ 3 సక్సెస్‌ అయ్యింది.

చంద్రుడిపై పరిశోధనల కోసం చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను ఆగస్టు 23న దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేసింది.

చంద్రయాన్-3 ల్యాండ్ చేసిన విక్రమ్ ల్యాండర్‌ నుంచి విడిపోయిన ప్రగ్యాన్‌ రోవర్‌ అంతకుమించి సక్సెస్‌ రేటుతో దూసుకుపోతోంది.

రోవర్‌ ప్రయోగాలు.. విక్రమ్‌ ల్యాండర్‌ ట్రాన్స్‌ఫర్‌ డేటా.. ఇస్రో అధ్యయనాలతో చంద్రయాన్‌ 3 ప్రాజెక్టు దుమ్ము రేపుతోంది.

చంద్రుడిపై చక్కర్లు కొడుతూ.. ప్రయోగాలతో సంచలనం రేపుతున్న ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇన్‌స్టంట్ ఇన్ఫర్మేషన్ అందించింది ఇస్రో.

జాబిల్లిపై పరిశోధనల కోసం దక్షిణ కొరియా పంపించిన లునార్‌ ఆర్బిటర్‌ దనూరి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది.

చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న దనూరి.. చంద్రయాన్-3 ల్యాండింగ్ పాయింట్ శివశక్తి‌, విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఫోటోలు తీసి పంపింది.

చంద్రుడి ఉపరితలంపై నుంచి సుమారు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి విక్రమ్ ఫొటోలు తీసినట్టు కొరియా ఏరోస్పేస్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది.

ఆగస్టు 28న విక్రమ్ ఫోటోలు తీసినట్లు దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ శివశక్తి పాయింట్ దక్షిణ ధ్రువం నుంచి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది.