మీ ఆరోగ్య బీమా లానే మీరు కొనే గ్యాడ్జెట్స్ కి కూడా ఇన్సూరెన్స్ అవసరం.. ఎందుకంటే..
17 October 2023
ఐఫోన్ 15 వచ్చింది. వెంటనే దాచుకున్న డబ్బులు బయటకు తీసి లక్షన్నర రూపాయలు పోసి ముచ్చటపడ్డ Iphone 15 pro max కొనేసుకున్నారు.
ఫోన్ ఇంటికి తీసుకువచ్చారు. వారం రోజులు గడిచాయి. అనుకోకుండా ఫోన్ మీ చేతిలోంచి జారీ కిందపడింది. పనిచేయడం మానేసింది. ప్రాణం ఉసూరు మంది.
ఫోన్ స్టోర్ కి తీసుకువెళ్లారు.. దీనికి వారెంట్ రాదు అన్నారు. రిపేరుకి 30 వేలు అయింది. అది జేబులోంచి తీసి కట్టేసి ఫోన్ తెచ్చుకున్నారు.
అదే మీరు కనుక మీ ఐ ఫోన్ కొన్నవెంటనే ఇన్సూర్ చేయించుకుని ఉంటె మీ జేబు నుంచి 30 వేలరూపాయలు పోయేవి కాదు.
ఎలాగైతే మనం హెల్త్ ఇన్సూరెన్స్.. టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నామో అలానే గ్యాడ్జెట్స్ కి కూడా చేయించుకోవాలి.
గాడ్జెట్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా ప్రమాదవశాత్తు సంభవించే నష్టాల నుంచి సమగ్ర రక్షణను అందిస్తాయి.
భూకంపం, అగ్ని ప్రమాదం, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే వాటి నుంచి కూడా సమగ్ర రక్షణను అందిస్తాయి.
కొన్ని పాలసీలు సాంకేతిక లోపాలు, సైబర్ భద్రతా ఉల్లంఘనలు - దొంగతనం నుంచి కూడా రక్షణను అందిస్తాయి. అటువంటి పాలసీలకు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.
మీరు మీ గాడ్జెట్‌లను కొనుగోలు చేసిన ఒక వారంలోపు బీమా చేయించుకోవాలి. ఏదైనా పరికరం, అది ఫోన్ లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేసిన 1 నెల తర్వాత ఇన్సూరెన్స్ చేయరు.