జాబిల్లిపై నీటి గుట్టు విప్పనున్న ఇస్రో!

13 October 2023

చంద్రుడిపై రహస్యాలు తెలుసుకునేందుకు ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ - 3 సురక్షితంగా ల్యాండ్ అయింది.

జాబిల్లిపై 150 మీటర్ల పాటు ప్రయాణించిన రోవర్, ల్యాండర్ పరస్పరం ఫొటోలు, మూలకాల ఆనవాళ్లను ఇస్రోకు చేరవేసింది.

చంద్రయాన్-3 విజయవంతం కావడంతో చంద్రయాన్-4 ప్రయోగాన్ని త్వరలోనే చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్న ఇస్రో.

జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి చంద్రయాన్-4 ప్రయోగాన్ని రెఢి అవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.

ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా ల్యూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ అనే పేరును సూచించే అవకాశాలు ఉన్నాయి.

జపాన్‌కు చెందిన హెచ్ 3 రాకెట్ ద్వారా ల్యూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ ప్రయోగం నిర్వహించనున్నట్టు తెలిసింది.

చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై నీటి జాడను కనుగొనడనికి ఈ మిషన్‌కు సంబంధించి ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ 2017లో ఒప్పందంపై సంతకం చేశాయి.

చంద్రయాన్-4 భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు మద్దతుగా నిలవడంతో పాటు చంద్రుడి రహస్యాలను విప్పుతుందంటున్న శాస్త్రవేత్తలు. ప్రయోగానికి సంబంధించి తేదీలపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.