ఇస్రో పట్టిందల్లా బంగారమే.. కీలక ప్రయోగం గ్రాండ్ సక్సెస్

22 October 2023

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు చేపట్టిన వరుస ప్రయోగాల్లో విజయపరంపర కొనసాగుతుంది.

శ్రీహరికోట వేదికగా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన గగన్‌యాన్‌ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది.

రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ఇస్రో చేపట్టిన టీవీ-డీ1 టెస్ట్ తో గగన్‌యాన్‌ దిశగా తొలి అడుగు పడింది.

ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌.. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి.

ఇది ఎలాంటి సమస్య లేకుండా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.

టీవీ-డీ1 పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు ఇస్రో ప్రయోగం చేసింది.

టీవీ-డీ1 టెస్ట్ సక్సెస్ కావడం గర్వకారణమన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.