అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోన్న భారత్. భారతీయ అంతరిక్ష సంస్థ ద్వారా ఇది జరగనుంది.
భారతదేశం ఇస్రో ద్వారా 2027 సంవత్సరంలో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రారంభించేందుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది.
ఇస్రో చేస్తున్న చంద్రయాన్-4 మిషన్ లక్ష్యం చంద్రుని ఉపరితలం నుండి రాతి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం.
చంద్రయాన్-4 మిషన్‌లో రెండు వేర్వేరు ప్రయోగాలు జరుగుతాయన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్.
ఇస్రో తలపెట్టిన చంద్రయాన్-4 మిషన్ 5 పరికరాలు ఎక్కువ బరువును మోయగల LVM ద్వారా చంద్రునిపైకి పంపడం జరుగుతుంది.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యధిక బరువు గల 5 పరికరాలు అంతరిక్షంలో ఒకదానికొకటి కనెక్ట్ చేయడం జరగుతుంది.
వచ్చే ఏడాది గగన్‌యాన్‌ను అంతరిక్షంలోకి పంపుతామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి.
సముద్ర ఉపరితలాన్ని పరిశోధించడానికి భారతదేశం 2026లో సముద్రయాన్‌ను ప్రయోగం. ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రత్యేక జలాంతర్గామిలో సముద్రంలో 6 వేల మీటర్ల లోతుకు పంపనున్నారు.