15 September 2023

ఆటోమొబైల్స్‌లో ఇకపై ఆ సౌకర్యం తప్పనిసరి!

వాహనాల్లో ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం 

దేశవ్యాప్తంగా ఆటోమొబైల్స్ డీలర్లకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ప్రతి వాహన డీలర్లు వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలను తప్పనిసరిగా తెరవాలని మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు.

5వ ఆటో రిటైల్ కాంక్లేవ్‌ వేదికగా ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తోందని స్పష్టం చేసిన మంత్రి గడ్కరీ. 

వాహన స్క్రాపింగ్ సౌకర్యాలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం డీలర్లకు ప్రత్యేక అనుమతలు ఇవ్వనుంది. 

దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్‌లో అతిపెద్ద తయారీదారుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం. 

భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఆటో డీలర్లు. 

ప్రపంచవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల తయారీలో 4వ స్థానం, వాణిజ్య వాహనాల తయారీలో 6వ స్థానంలో భారత్‌.

ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తుందన్న కేంద్ర మంత్రి గడ్కరీ.