చంద్రుడి నేల నిజంగా తెల్లగా ఉందా..?
TV9 Telugu
15 January 2024
విశాలమైన అంతరిక్షంలో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు. తన కదలికల ద్వారా భూమి మీద ఉన్న జీవరాశిపై ప్రభావం చూపుతుంటాడు.
చంద్రుడు ఎర్రగా ఉంటే తీవ్రంగా గాలులు వీస్తాయి. పాలిపోయినట్లు ఉంటే వర్షం కురుస్తుంది. తెల్లగా ఉంటే వర్షమూ మంచూ అసలు కురవదంటారు.
భూమి మీది వాతావరణాన్ని చంద్రుడు చాలా ప్రభావితం చేస్తాడు. భూ వాతావరణ వ్యవస్థల్లో చంద్రుని ప్రభావం ఉంటుంది.
మనం భూమి నుండి చంద్రుడిని చూసినప్పుడు, అది తెల్లగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చంద్రుడి ఉపరితలం తెలుపు రంగులో ఉంటుందని అంచనా .
రాత్రిపూట కూడా చంద్రుడు ఎప్పుడు తెల్లటి గోళంలా మెరుస్తూ ఉంటాడు. అయితే, చంద్రుని ఉపరితలం రంగు తెలుపు కాదు.
చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టినప్పుడు, ఒక పాదముద్ర ఎల్లప్పుడూ ఉంటుంది. చంద్రుని నేల రంగు ముదురు బూడిద రంగులో ఉంటుంది.
చంద్రుని ఉపరితలంపై నేల రంగు తెలుపు, నలుపుతో కొద్దిగా నారింజ మిశ్రమంతో కూడి ఉంటుందని శాస్త్రవేత్తలు అన్నారు.
ఇక్కడి భౌగోళిక పరిస్థితులే ఇందుకు కారణం. మట్టికి బదులుగా, చంద్రునిపై కొంత పొడి పదార్థం ఉంది. దీన్ని లూనార్ రెగోలిత్ అంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి