ఇస్రో చేపట్టిన సముద్రయాన్ మిషన్ లక్ష్యం అదేనా..?
18 September 2024
Battula Prudvi
సముద్రయాన్ మిషన్ నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) సిద్ధమైంది. ఈ మిషన్ ద్వారా సముద్ర వనరులను అధ్యయనం చేస్తుంది.
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్‌లో సముద్రయాన్ సబ్‌మెరైన్‌ను ఈ మిషన్ కోసం సిద్ధం చేస్తున్నారు.
ఈ జలాంతర్గామిని శాస్త్రీయ సెన్సార్లు, పరికరాలతో నిండిన ఉక్కు గోళాన్ని నిర్మిస్తున్నారు శాస్త్రవేత్తలు.
సముద్రయాన్ సబ్‌మెరైన్ కార్యాచరణ సామర్థ్యం 12 గంటలు, అత్యవసర పరిస్థితుల్లో దీన్ని 96 గంటలకు పెంచవచ్చు.
సముద్రయాన్ మిషన్ ద్వారా, ముగ్గురు ఆక్వానాట్స్‌ను హిందూ మహాసముద్రంలోని సముద్రగర్భానికి పంపుతుంది ఇస్రో.
సముద్రయాన్ మిషన్‌లో సబ్‌మెరైన్ సముద్రంలో 6000 మీటర్ల లోతుకు అంటే దాదాపు 6 కిలోమీటర్ల లోతుకు వెళ్తుంది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన సముద్రయాన్ నౌకను సముద్రం లోతుల్లోకి పంపేందుకు సిద్ధమవుతోంది ఇస్రో.
సముద్రయాన్ మిషన్ 2021లో ప్రారంభమైంది. భారత్‌కి ముందు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సముద్రంలో ఈ మిషన్లను విజయవంతంగా పరీక్షించాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి