ఐఫోన్ 16 సిరీస్ ధర లీక్..?

TV9 Telugu

01 September 2024

ఆపిల్ తన రాబోయే ఫోన్ ఐఫోన్ 16 లాంచ్ తేదీని ఇటీవల ప్రకటించింది. ఈ ఫీచర్స్ ఏంటి ఎప్పుడు రానుందో ఈరోజు చూద్దాం.

కంపెనీ ఐఫోన్ 16ని సెప్టెంబర్ 9, 2024న లాంచ్ చేయబోతోంది. ఐఫోన్ 16 సిరీస్ ధరలు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి.

ఆపిల్ హబ్‌ పేర్కొంటున్నట్లు ప్రకటన చక్కర్లు కొడుతోంది. ఐఫోన్ 16 ధర $799 డాలర్లు ఉండవచ్చని, ఇది భారతీయ ధర ప్రకారం రూ. 67,100 అని తెలుస్తోంది.

అదే సమయంలో, iPhone 16 Plus ప్రారంభ ధర $899 డాలర్లు కావచ్చు. ఇది భారతదేశంలో 90 వేల రూపాయలకు దొరికే ఛాన్స్!

iPhone 16 Pro ధర $1099 కావచ్చు అని అంచనా. భారతీయ కరెన్నీ ప్రకారం దీని ధర దాదాపు లక్ష రూపాయల వరకు ఉండవచ్చు.

iPhone 16 Pro Max ధర $ 1199 కావచ్చు. దీని ధర భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1.25 లక్షలు ఉండే ఛాన్స్ ఉంది.

iPhone 15 Plus మాదిరిగానే ఈ ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. ఆపిల్ కంపెనీ కొత్త కెమెరా డిజైన్‌తో ఐఫోన్ 16ని లాంచ్ చేయవచ్చు.

ఈ కొత్త ఫోన్‌లో అనేక ఆధునిక ఫీచర్లను కూడా ఉన్నాయట. ఇది భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9 రాత్రి 10:30 గంటలకు ఒక ఈవెంట్‌లో లాంఛ్ చేయనున్నారు.