ఐఫోన్‌ 16 స్మార్ట్‌ ఫోన్‌ ఎప్పుడు విడుదలో తెలుసా? ఫీచర్స్‌ లీక్‌

19 August 2024

Subhash

ఐఫోన్ 16 త్వరలో లాంచ్ కానుంది. కంపెనీ ఈ సిరీస్‌ని వచ్చే నెలలో అంటే సెప్టెంబర్‌లో ప్రారంభించనుంది. 

ఐఫోన్ 16

అయితే ఫోన్‌ విడుదల తేదీ గురించి కంపెనీ అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినప్పటికీ సెప్టెంబర్‌లో రానుందని సమాచారం.

సెప్టెంబర్‌లో

ఐఫోన్ 16 ప్రోకు సంబంధించి తాజా అప్‌డేట్‌లో లీక్ అయ్యింది. దీనితో పాటు, ఫోన్ కలర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి.

ఐఫోన్ 16 ప్రో

టిప్‌స్టర్ సోనీ డిక్సన్ ఐఫోన్ 16 ప్రో డమ్మీ ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్‌ చేశారు.

ఐఫోన్ 16 ప్రో

సోషల్ మీడియా పోస్ట్‌ను విశ్వసిస్తే, ఐఫోన్ 16 ప్రోని నలుపు, తెలుపు, గోల్డ్, గ్రే లేదా టైటానియం రంగులలో ప్రారంభించవచ్చు. 

సోషల్ మీడియా

ఈ హ్యాండ్‌సెట్ ఐఫోన్ 15 ప్రోని పోలి ఉంటుంది. కంపెనీ గత సంవత్సరం బ్లూ టైటానియం షేడ్‌ను బంగారు రంగుతో రానుందని తెలుస్తోంది. 

హ్యాండ్‌సెట్

ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ నలుపు, తెలుపు (లేదా వెండి), గ్రే, రోజ్ షేడ్స్‌లో రావచ్చని ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో మేలో చెప్పారు. 

ఐఫోన్ 16 ప్రో

లీకుల ప్రకారం.. ఇందేలో A18 ప్రో చిప్, 6.27-అంగుళాల డిస్‌ప్లే, 3577mAh బ్యాటరీ, 40W ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఉండే అవకాశం ఉందని సమాచారం.

లీకుల ప్రకారం..