13 April 2024
TV9 Telugu
మార్కెట్లో రోజురోజుకు ఎన్నో స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. వినియోగదారులకు తగ్గట్లుగానే కొత్త ఫీచర్స్ జోడిస్తూ విడుదల చేస్తున్నాయి కంపెనీలు.
యాపిల్ ఐఫోన్.. ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న ఫోన్. అద్భుతమైన ఫీచర్స్, కెమెరా, దాని లూక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఈ ఏడాది చివరిలో న్యూ వర్టికల్ అలైన్డ్ కెమెరా లేఅవుట్, యాక్షన్ బటన్ వంటి డిజైన్ మార్పులతో రానున్నాయి.
ఇక యాపిల్ తన నెక్ట్స్ ఐఫోన్ మోడల్స్‌లో మరో రెండు అడిషనల్ కలర్ ఆప్షన్స్‌తో ముందుకొస్తోందని టెక్ నిపుణులు లేటెస్ట్ లీక్‌లో వెల్లడించారు.
ఇక టిప్‌స్టర్ ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ అప్‌కమింగ్ ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్, వైట్, యల్లో కలర్ ఆప్షన్స్‌లో రానున్నాయని అంచనా.
వీటిలో పర్పుల్, వైట్ ఆప్షన్స్ నూతనంగా జోడించనుండగా, మిగిలిన కలర్స్ స్టాండర్డ్ ఐఫోన్ 15 మోడల్స్. ఐఫోన్ 16 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో రావచ్చు.
న్యూ సిరీస్ ఫోన్ల విడుదలకు ముందు ముందు యాపిల్ జూన్ 10 నుంచి ఆరంభమయ్యే డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024 ఈవెంట్ వేదికగా కొన్ని కీలక అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఈవెంట్ వేదికగా ఐఓఎస్ 18, మ్యాక్ఓఎస్ 15, ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో భాగంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే సాఫ్ట్‌వేర్ ఫీచర్స్‌ను ప్రదర్శించనుంది.