ల్యాప్‌టాప్-కంప్యూటర్ దిగుమతులపై భారత్ ఆంక్షలు
18 October 2023
అమెరికా, చైనా, కొరియా, చైనీస్, తైపీ నుంచి వచ్చే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు విధించిన భారత్.
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇతర PC ఉత్పత్తుల దిగుమతికి లైసెన్సింగ్ తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
విదేశీ పరికరాలలో హార్డ్‌వేర్‌లో భద్రత సంబంధిత లోపాలను పరిష్కరించడంతో పాటు దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం.
కంప్యూటర్ వస్తువుల దిగుమతి కోసం నవంబర్ 1 నుండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుండి లైసెన్స్ పొందవలసి ఉంటుంది.
విదేశీ కంప్యూటర్ దిగుమతులపై ఆంక్షలు విధించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్య దేశాలు.
భారతదేశం ప్రతి సంవత్సరం 7-8 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన కంప్యూటర్ వస్తువులను దిగుమతి చేసుకుంటుంది.
2021-22లో $7.37 బిలియన్ల, 2022-23లోనే $5.33 బిలియన్ల విలువైన ల్యాప్‌టాప్‌లతో సహా వ్యక్తిగత కంప్యూటర్‌లను దిగుమతి చేసుకుంది భరత్.
ఇప్పుడు వెలువడిన DGFT నోటిఫికేషన్ ప్రకారం, దిగుమతులకు సంబంధించిన పరిమితులు నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి