వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఇది ల్యాప్‌టాప్ స్టాండ్ చాలా ఉపయోగకరం. అనుకూలంగా కూర్చొని పని చేసేందుకు ఈ ల్యాప్‌టాప్ స్టాండ్‌లు సహాయపడతాయి.
మీరు వీడియో కాల్ మాట్లాడే సమయంలో గదిలో ఎక్కువగా వెలుతురు లేకపోతే ఇబ్బందిగా ఉన్నట్లయితే రింగ్ లైట్ చాలా సహాయపడుతుంది.
ల్యాప్‌టాప్ కీస్‌లోకి దుమ్ము చేరకుండా ఉండేందుకు కీబోర్డ్ కవర్స్ ఉపయోగపడతాయి. నీరు లాంటి లిక్విడ్ పడినా కీబోర్డ్ డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి.
రాత్రుళ్ళు కీబోర్డ్ సరిగ్గా కనిపించేలా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకునేలా యూఎస్‌బీ లైట్ ఉపయోగకరం. దీన్ని కనెక్ట్ చేసుకుంటే చీకట్లోనూ కీస్ బాగా కనిపిస్తాయి.
ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే లైట్ గ్లేర్ కళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. దీన్ని తగ్గించుకునేందుకు యాంటీ గ్లేర్ ఫిల్టర్‌ను ల్యాప్‌టాప్ స్క్రీన్‌కు ఏర్పాటు చేసుకోవచ్చు.
మీకు ఎక్కువగా వీడియో కాల్స్ మాట్లాడుతుంటే.. క్వాలిటీ ఉన్న వెబ్ క్యామ్‌ను తీసుకోవచ్చు. సాధారణంగా ల్యాప్‌టాప్‌కు ఉండే కెమెరాలు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు.
ల్యాప్‌టాప్‌లో ఎక్కువ గేమింగ్ చేసే వారికికూలింగ్ ప్యాడ్ ఉపయోగపడుతుంది. ల్యాప్‌టాప్ హీట్ అయి పర్ఫార్మెన్స్ తగ్గకుండా ఇది సహాయపడుతుంది.
ల్యాప్‌టాప్ కెమెరాను వినియోగించేందుకు స్పైవేర్స్, మాల్‌వేర్ ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి వాటిని నిరోధించేందుకు కెమెరా షటర్స్‌ను వినియోగించవచ్చు.