వాట్సాప్ లో ఫేక్ కాల్ చేస్తే జైలుకే!
TV9 Telugu
31 March 2024
ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యాప్‌లో చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి.
సైబర్ నేరస్థులు, హ్యాకర్లు, నకిలీ ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ప్రజలతో నకిలీ కాల్స్ చేస్తున్నారు దుండగులు.
భయపడాల్సిన అవసరం లేదు. వినియోగదారుల భద్రత దృష్ట్యా వాట్సాప్ మాతృ సంస్థ అయినా మెటా సంచలన నిర్ణయం తీసుకుంది.
వాట్సాప్ ద్వారా నకిలీ కాల్, మెసేజ్ పంపించే వ్యక్తులను జైలుకు పంపవచ్చట. అదెలా అని ఆలోచిస్తున్నారా. అయితే ఇది చుడండి.
వాట్సాప్ సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి టెలికాం డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ పోర్టల్ 'చక్షు'ను ప్రారంభించింది.
బ్యాంక్ ఖాతా, పేమెంట్ వాలెట్, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, సెక్స్‌టార్షన్, KYC అప్‌డేట్‌కు సంబంధించిన స్పామ్ కాల్‌లు, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయొచ్చు.
WhatsApp యొక్క నకిలీ కాల్స్, సందేశాలపై ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ (https://sancharsaathi.gov.in/)లో ఫిర్యాదు చేయాలి.
మీతో ఎవరైనా ఇలాంటి కాల్స్ చేయమంటే వారి ట్రాప్ లో పడకుండా వెంటనే అధికారులు చెప్పిన వెబ్ సైట్ లో కంప్లైంట్ చెయ్యండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి