ఈ యాప్ ఉంటె చాలు నకిలీ బంగారం పట్టేయవచ్చు.. ఎలా అంటే..

09 September 2023

బంగారం కొనడానికి వెళుతున్నారా? అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని వెళ్ళండి.బంగారం ఎంత స్వచ్చమైనది ఈ యాప్ చెప్పేస్తుంది. ఏమిటి? డౌటా.. యాప్ ఎలా చెప్పేస్తుంది అంటారా?

బంగారం అసలుదా? నకిలీదా? అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎంత జాగ్రత్తగా ఉన్నా నకిలీ బంగారం కొని మోసపోవడం జరుగుతుంది.

అందుకే భారత ప్రభుత్వం బంగారంపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఇప్పుడు హాల్ మార్క్ ఉంటేనే బంగారం కొనడం మంచిది,

అయితే, కొందరు నకిలీ బంగారానికి.. నకిలీ హాల్ మార్క్ కూడా వేసి అమ్మేస్తున్న సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.

అందుకే, ఇలాంటి నకిలీలకు అడ్డుకట్ట వేయడానికి.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఒక యాప్ తీసుకువచ్చింది.

దీని పేరు BIS కేర్ యాప్. బంగారం కొనేముందు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. దానిని ఓపెన్ చేయండి.. మీ పేరు, ఆధార్ నెంబర్, ఈ మెయిల్ వంటి డిటైల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి.

ఇప్పుడు బంగారం స్వచ్చత తెలుసుకోవడానికి ఏమి చేయాలో చూద్దాం. హాల్ మార్క్ చేసిన బంగారం HUID అనే కోడ్ తో ఉంటుంది.

యాప్ ఓపెన్ చేసి మీరు కొనాలనుకున్న బంగారంపై ఉన్న HUID కోడ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి. వెంటనే మీ బంగారం స్వచ్చత.. Make అన్ని వివరాలు తెలుస్తాయి.