స్మార్ట్ వాచ్‌లతో ఒత్తిడి దూరం.. ఎలాగంటే.?
TV9 Telugu
02 November 2024
ప్రస్తుతకాలంలో టెక్నాలజీ పెరడంతో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం కూడా బాగా పెరిగింది. చాలామంది చేతికి కనిపిస్తుంది.
జేబులో సెల్‌ఫోన్ లాగే చేతికి స్టయిల్‌గా కనిపించే స్మార్ట్‌వాచ్ పెట్టుకోవడం ఈ జనరేషన్‌కి కామన్‌గా మారింది.
మనం ఎంత దూరం నడిచాం? గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందీ..? ఒంట్లో ఎన్ని కేలరీలు కరిగాయో వాచ్ చెబుతుంది.
చిన్న వయసులో హార్ట్ ఎటాక్‌కు కారణమయ్యే ఒత్తిడిని కూడా స్మార్ట్ వాచ్‌లు దూరం చేస్తాయని తాజా అధ్యయనంలో తెలిసింది.
ఎలాగంటే.. స్మార్ట్‌వాచీలు, రిస్ట్‌బ్యాండ్‌లు ధరించేవాళ్లలో మానసిక ఒత్తిడి తాలూకు లక్షణాలు కనిపించగానే అవి యూజర్లను అప్రమత్తం చేస్తాయి.
స్మార్ట్‌ఫోన్‌కి సందేశాలు పంపిస్తుంటాయి. దాంతో అప్రమత్తమై చాలా మంది ఆ ప్రభావం నుంచి బయటపడేలా ప్రయత్నాలు చేస్తారట.
వీటితోపాటు నిద్ర కరవైనా, గుండె కొట్టుకునే వేగంలో తేడాలు గమనించినా ఆటోమేటిగ్గా నోటిఫికేషన్లు వస్తుంటాయి కదా!
వీటినీ పట్టించుకోవడం సహజమే కదా. ఇలా ప్రతి ఒక్కరు అప్రమత్తం కావడం.. దీర్ఘకాలంలో ఒత్తిడి దూరం అయ్యేలా చేస్తాయట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి