ఒరిజినల్ ఛార్జర్‌‎ను గుర్తించండి ఇలా..?

TV9 Telugu

03 November 2024

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడానికి ఛార్జర్ చాలా ముఖ్యం. ఛార్జింగ్ పెట్టడం కోసం ఇది కచ్చితంగా మన దగ్గర ఉండాలి.

ప్రస్తుతం చాలా కంపెనీలు ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను అందించకపోవడంతో ప్రజలు బయటి నుంచి ఛార్జర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ఇది కొనేటప్పుడు ఎక్కువమంది ప్రజలు తెలియకుండా చాలా సార్లు డూప్లికేట్ ఛార్జర్‌లను కొనుగోలు చేస్తున్నారు.

డూప్లికేట్ ఛార్జర్‌‌తో స్మార్ట్‌ఫోన్‌ ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఫోన్ త్వరగా పాడైపోతుంది.

ప్రతి బ్రాండ్ ఇస్తున్న ఒరిజినల్ ఛార్జర్‌పై R నంబర్ ఉంటుంది. ఈ సింబల్ చూసుకుని చార్జర్ కొనుగోలు చేయాలి.

బ్రాండెడ్ ఛార్జర్‌పై ఉన్న ఈ R నంబర్ సింబల్ దాని నాణ్యత గురించి చెబుతుందని చెబుతున్నారు టెక్నాలజీ నిపుణులు.

నకిలీ ఛార్జర్లలో చౌకైన ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. దీని కారణంగా చార్జర్ త్వరగా పాడైపోతుంది. ఫోన్ లైఫ్ కూడా తగ్గుతుంది.

అసలు ఛార్జర్‌ని మొబైల్ కంపెనీఅఫీషియల్ సైట్, అవుట్‌లెట్ లేదా మొబైల్ యాప్ లో నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.