ఆటోను కేవలం మూడు నిమిషాల్లో స్కూటర్‌గా మార్చుకునే కొత్త వెహికల్‌

28 January 2024

TV9 Telugu

హీరో మోటోకార్ప్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన సర్జ్ (Surge) తాజాగా టూ ఇన్ త్రీవీలర్ వెహికల్‌ను లాంఛ్ చేసింది

 హీరో మోటో కార్ప్‌

 ఆటోను కేవలం మూడు నిమిషాల్లో స్కూటర్‌గా మార్చుకునే కొత్త వెహికల్‌ను రూపొందించింది మోటో కార్ప్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ

 మూడు నిమిషాల్లో

ఈ టూ ఇన్ త్రీవీలర్ వెహికల్‌ పూర్తిగా విద్యుత్‌తోనే నడుస్తుంది. ఇందులో అనేక ఫీచర్స్‌ను జోడించింది

 విద్యుత్‌తోనే..

సాధారణ ఆటోల వలే ఈ వాహనంలో కూడా విండ్ స్క్రీన్, హెడ్ ల్యాంప్, లగేజ్ ట్రక్, వైఫర్లు ఉంటాయి. డోర్లు లేకపోయినా జిప్ కలిగి ఉండే సాఫ్ట్ డోర్లు ఉంటాయి

ఆటో లాగా

 కావాలనుకున్నప్పుడు ఈ ఆటో ముందు భాగం నుంచి స్కూటర్‌ను బయటకు తీసుకోవచ్చు. ఈ స్కూటర్‌లో 3కిలో వాట్ల ఇంజిన్, 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు

బ్యాటరీ

సర్జ్ ఎస్ 32  పేరుతో లాంఛ్ అయిన ఈ వెహికల్‌లోని ఆటో 50 కి.మీ. గరిష్ట వేగంతో 500 కిలోల బరువును రవాణా చేయగలదు

 సర్జ్‌ ఎస్‌ 32 పేరుతో

స్కూటర్ 60 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణం చేయగలదు. ఈ ఆటోను సరకు రవాణా వాహనంగానూ, ప్రయాణికుల వాహనంగానూ ఉపయోగించుకోవచ్చు

 స్కూటర్‌ వేగం

హీరో నుంచి ఆటోను కేవలం మూడు నిమిషాల్లో స్కూటర్‌గా మార్చుకునే కొత్త వెహికల్‌. దీని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

 స్కూటర్‌గా మార్చుకోవచ్చు