కొత్తగా వచ్చిన మైండ్ రీడింగ్ హెల్మెట్‌ను చూశారా?
17 December 2023
మారుతున్న కాలం కొద్దీ టెక్నాలజీ కూడా పెరుగుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సరికొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.
తాజాగా టెక్నాలజీతో ఓ కొత్త పరికరాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇది మనసులో ఉన్న ఆలోచనలు బయటకి తెలియజేస్తుంది.
‘ఆదిత్య 369’ సినిమా గుర్తుందా? మనసులో అనుకొన్న విషయాలు స్పీకర్లలో వినిపించడం వింతగా అనిపించింది కదూ.
దాదాపుగా అలాంటి పరికరాన్నే ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిడ్నీ పరిశోధకులు తయారు చేశారు.
మన మనసులోని ఉన్న ఆలోచనలను అక్షరీకరించే హెల్మెట్ లాంటి డివైజ్‌ను అభివృద్ధి చేశారు అక్కడ శాస్త్రవేత్తలు.
ఎలక్ట్రో ఎన్సఫలోగ్రామ్ (ఈఈజీ) సాంకేతికతతో ఈ డివైజ్ పని చేస్తుందన్నారు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిడ్నీ పరిశోధకులు.
పక్షవాతం వచ్చినా లేదా వివిధ ప్రమాదాల్లో గాయపడి మాట కోల్పోయిన వారికి ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందట.
ఈ హెల్మెట్ సాయంతో తమ భావాలను ఇతరులకు సులభంగా తెలియజేయవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి