గూగుల్ ప్రాజెక్ట్ గ్రీన్ లైట్‌తో ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌

19 October 2023

ఏ న‌గ‌రంలోనైనా ట్రాఫిక్ క‌ష్టాలు మామూలే. ట్రాఫిక్ జామ్‌లు ప్ర‌జ‌ల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగిస్తుంటాయి.

వాహ‌నాలు బారులుతీరడంతో ట్రాఫిక్ ర‌ద్దీ పెర‌గ‌డ‌మే కాకుండా కాలుష్యం కూడా ఆందోళ‌న‌క‌రంగా పెరిగిపోతుంది.

న‌గ‌రాల్లో వాహ‌నాల నుంచి విడుద‌ల‌య్యే ఉద్గారాల‌ను తగ్గించేందుకు ప్రాజెక్ట్ గ్రీన్ లైట్ కోసం గూగుల్‌ ఏఐ టెక్నాల‌జీని వాడనుంది.

హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్‌, కోల్‌క‌తాలో గూగుల్ ఏఐ ట్రాఫిక్ క‌ష్టాల‌ను ప‌రిష్క‌రించేందుకు ఇప్పటికే ప్ర‌య‌త్నిస్తోంది.

గూగుల్ ప్రాజెక్ట్ గ్రీన్ లైట్‌లో భాగంగా కర్ణాటక రాజధాని బెంగ‌ళూర్‌లో న్యూ ట్రాఫిక్ లైట్స్‌ను అమ‌ర్చారు.

న‌గ‌రంలోని వివిధ ఇంట‌ర్‌సెక్ష‌న్స్‌లో వాహ‌నాల నుంచి ఉద్గారాల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం కూడా జ‌రుగుతోంది.

ఆయా ప్రాంతాల్లో డ్రైవింగ్ ట్రెండ్స్ ఆధారంగా గూగుల్ మ్యాప్స్ డేటాను అన‌లైజ్ చేస్తూ ఈ ప్ర‌క్రియ‌ను చేప‌డుతుంది.

ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మహా నగరాల్లో కొంత మేర ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ పెట్టినట్టే అంటున్నారు నిపుణులు.