వినియోగదారులకు చేరువయ్యేందుకు గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. తమ వినియోగదారులను ప్రమాదాల పట్ల అప్రమత్తం చేసేందుకు సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది గూగుల్.
ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా భారతదేశంలో భూకంప హెచ్చరికల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్. తమ ప్రాంతంలో భూకంపాల గురించి ముందస్తు సమాచారం తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
రాబోయే ప్రమాదం నుంచి.. భూకంపాల బారి నుంచి రక్షించుకోవడానికి చర్యలు తీసుకునేందుకు దీని ద్వారా అవకాశం ఉంటుంది.
భారత్‌లోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, నేషనల్ సిస్మోలజీ సెంటర్‌తో కీలక ఒప్పందం చేసుకుంది గూగుల్.
భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో సెన్సార్‌లను ఉపయోగిస్తుంది.
ఆండ్రాయిడ్ పరికరాలు ఇప్పటికే సపోర్ట్ చేసే భారతీయ భాషల్లో అలర్ట్‌లు పంపించేందుకు ఏర్పాట్లు చేసింది గూగుల్.
ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో సీస్మోమీటర్‌లుగా పని చేసేలా చిన్న యాక్సిలరోమీటర్‌లను ప్రవేశపెట్టింది గూగుల్.
ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్లగ్ ఇన్ చేసి ఛార్జింగ్ చేసినప్పుడు, భూకంపం ప్రారంభాలను గుర్తించి తెలియజేస్తుంది.