ఫ్రాడ్ GPT ఇప్పుడు సైబర్ నేరగాళ్ల అడ్డా..

04 September 2023

ఇప్పటివరకూ GPT గురించే పూర్తిగా ఎవరికీ తెలియడం లేదు. కానీ, ఇప్పుడు ఫ్రాడ్ జీపీటీ వెలుగులోకి వచ్చింది.

మీరు సరిగ్గానే విన్నారు..అది ఫ్రాడ్ జీపీటీ నే. ఈ ఫ్రాడ్ జీపీటీ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచాన్ని టెక్నీకల్ గా గడగడలాడించే డార్క్ నెట్ లో ఈ ఫ్రాడ్ జీపీటీ అలాగే వార్మ్ జీపీటీ అందుబాటులోకి వచ్చింది.

ఇది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాక్స్. దీనిని చాట్ జీపీటీ త్రీ ప్లాట్ ఫామ్ లో తయారు చేశారు.

ఈ ఫ్రాడ్ జీపీటీ సైబర్  క్రిమినల్స్ కోసం ఫిషింగ్ ఈ మెయిల్ , ట్యాపింగ్ టూల్స్  వంటివి తయారు చేస్తుంది.

200 డాలర్ల నుంచి 1700 డాలర్ల వరకూ ఈ ఫ్రాడ్ జీపీటీ ఖరీదు ఉంటుంది. దీనిద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజల ఎకౌంట్స్ సులభంగా ఖాళీ చేసేస్తారు.

మీకు ఏమనిపిస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ప్రమాదాల ఘంటికలు కూడా గట్టిగానే మోగుతున్నట్టు అనిపిస్తోంది కదూ.

నిజమే.. జాగ్రత్తగా ఉండడం అవసరమని తెలుసుకోండి. GPTగురించి మాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకున్నాం.