త్వరలో వాట్సప్‌ ద్వారా ఫుడ్ అర్డర్..!

21 September 2023

భారత్‌లో వాట్సాప్ ఉపయోగించే వ్యాపారుల కోసం సరికొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది వాట్సప్‌ మాతృ సంస్థ మెటా.

యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ముంబయిలో జరిగిన కార్యక్రమంలో వీటిని ప్రకటించింది.

మెటా రెండో వార్షిక సమావేశంలో ఈ టూల్స్‌ను మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వర్చువల్‌గా ఆవిష్కరించారు.

భారత్‌లోని వ్యాపారులు వాట్సప్‌ను సమర్థంగా  ఉపయోగించుకుని బిజినెస్ చక్కబెట్టుకొంటున్నారని కొనియాడారు.

ముంబాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మెటా తీసుకొచ్చిన కొత్త వాట్సప్‌ ఫీచర్లను జుకర్‌బర్గ్‌ పరిచయం చేశారు.

మెటా వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ అలాగే వాట్సప్‌ చాట్‌లోనే పేమెంట్‌ సైతం చేసేలా సరికొత్త సదుపాయం తీసుకొచ్చింది వాట్సాప్.

కొత్తగా వాట్సప్‌లో మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ‘ఫ్లోస్‌’ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఫ్లోస్ సదుపాయం ద్వారా చాట్‌ థ్రెడ్స్‌లోనే యూజర్స్‌కు కావాల్సిన సేవలను అందించొచ్చని భావిస్తోంది మెటా.

వాట్సప్‌ ఫ్లోస్‌ ద్వారా బ్యాంక్‌ కస్టమర్‌ అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవడంతో పాటు, బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచే సదుపాయం కలుగుతుంది.

ఇక నుంచి వాట్సాప్ ద్వారా ఫుడ్‌ డెలివరీ సర్వీసు రెస్టారెంట్‌ నుంచి ఎంపిక చేసిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు.

విమాన ప్రయాణ టికెట్‌ బుకింగ్‌తో పాటు సీట్లను ఎంపిక చేసుకునే సదుపాయాన్ని వాట్సప్‌లోనే పొందవచ్చు.