నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయా..? ఈ చిట్కాలు పాటించండి!
TV9 Telugu
02 April 2024
ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీ సెల్‌ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యల నుండి బయటపడతారని టెక్ నిపుణులు చెబుతున్నారు.
కొన్నిసార్లు సిగ్నల్ లేని ప్రదేశంలో సెల్‌ఫోన్‌లో నెట్‌వర్క్ ఆగిపోయినప్పుడు మనం ముఖ్యమైన కాల్ చేయాల్సి వస్తుంది.
ఫోన్ లో నెట్‌వర్క్ లేకపోవడంతో మొబైల్ నుంచి ఎవరికైనా కాల్స్ చేయడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు మొబైల్ లో నెట్‌వర్క్ సమస్యను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.
మీ ఫోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం మొదటి మార్గం. ఎయిర్‌ప్లేన్ మోడ్ పని చేయకపోతే, మీరు మీ ఫోన్‌ను కూడా రీస్టార్ట్ చేయవచ్చు.
సెల్‌ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం పని చేయకపోతే, మీరు సిమ్‌ను తీసేసి శుభ్రం చేయవచ్చు అన్నది టెక్ నిపుణల మాట.
నాల్గవ పద్ధతి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించవచ్చు అన్నారు నిపుణులు.
ఐదవ పద్ధతి నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయడం, ఇది ఫోన్ డిస్‌కనెక్ట్‌ను కూడా పరిష్కరిస్తుంది. దీని కోసం మీరు సెట్టింగ్‌లకు వెళ్లి నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీస్టార్ట్ చేయాలి.