తేజస్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు

26 November 2023

క్షణ వ్యవస్థను పటిష్టపరిచేందుకు పూర్తి స్వదేశీ సామర్థ్యంతో రూపొందించిన తేజస్‌ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

తేజస్ అనేది లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ప్రోగ్రామ్ నుండి అభివృద్ధి చేసిన భారతీయ నిర్మిత సింగిల్-ఇంజిన్ ఫైటర్ జెట్.

1980లలో ప్రారంభమైన ఈ తేలికపాటి విమానం డెల్టా వింగ్, తేలికపాటి మల్టీరోల్ ఫైటర్. తేజస్ సూపర్‌సోనిక్ యుద్ధ విమానం, ఇది భారత వైమానిక దళానికి మకుటాయమానం.

అతి చిన్న, తేలికైన విమానం ఇది. ఇతర దేశాల్లోనూ దీనికి డిమాండ్‌ ఉంది. మార్క్ II తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంయుక్త తయారీ కోసం అమెరికా HALతో ఒప్పందం కుదుర్చుకుంది.

MiG 21 స్క్వాడ్రన్‌ల స్థానంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ దశలవారీగా భారత వైమానిక దళంలోకి చేరబోతున్నాయి.

తేజస్ తేలికపాటి యుద్ధ విమానం ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ (AAR) సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది రక్షణ కల్పిస్తుంది.

ఇందులో యాక్టివ్ ఎలక్ట్రానిక్-స్కాన్డ్ అర్రే (AESA) రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (EW) సూట్‌తో అమర్చారు.

తేజస్ అనేది దృశ్య శ్రేణికి మించిన క్షిపణి సామర్థ్యాలు, కనీస రీలోడింగ్ సమయంతో గాలి నుండి ఉపరితల ఆయుధాలతో కూడిన పూర్తి క్షిపణి-సాయుధ పోరాట విమానం.