జియో ఎయిర్‌ఫైబర్‌ ప్లాన్స్, ఫీచర్స్ ఇవే..!

19 September 2023

వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు గుడ్‌న్యూస్.వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఎయిర్‌ఫైబర్‌ అందుబాటులోకి వచ్చేసింది.

జియో ఎయిర్‌ఫైబర్‌ పూర్తిగా 5జీ ఆధారిత వైర్‌లెస్‌ వైఫై సర్వీస్‌. అత్యంత వేగంగా ఇల్లు, ఆఫీస్ అవసరాలకు ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

ప్రస్తుతం అందుబాటులోని వైర్‌ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్లకు ప్రత్యామ్నాయంగానే దీన్ని రిలయన్స్ జియో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్‌ ఎలాంటి కేబుల్స్‌, వైర్లు అవసరం లేకుండానే వినియోగదారులకు సేవలు అందించనుంది.

జియో ఎయిర్‌ ఫైబర్‌ డివైజ్‌ను ఆన్‌ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్‌ ద్వారా దగ్గర్లోని టవర్‌ సహయంతో ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ను అందిస్తుంది.

జియో ఎయిర్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ కంటే అత్యంత వేగంగా వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ సేవలు రూ.599 తో మొదలవుతాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌,అమెజాన్ ఫ్రైమ్ తదితర ఓటీటీలు లభిస్తాయి.

జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు 6నెలలు, 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయని రిలయన్స్ సంస్థ తెలిపింది. ప్లాన్‌ ధరకు జీఎస్టీ అదనం.

ప్రస్తుతానికి హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పుణె నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ అందుబాటులోకి వచ్చింది.