TV9 Telugu
ఫోన్ పే ఇండస్ ప్రత్యేకతలివే!
25 Febraury 2024
భారతదేశవ్యాప్తంగా డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తెరతీసింది.
భారతదేశ రాజధాని ఢిల్లీ వేదికగా డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే ఇండస్ యాప్‌స్టోర్‌ను లాంచ్ చేసింది.
భారతదేశ కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఇండస్ యాప్‌స్టోర్‌ను ప్రారంభించడం జరిగింది.
మొత్తం 12 ప్రాంతీయ భాషల్లో యాప్‌స్టోర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు నచ్చిన భాషలో యాప్స్ పొందొచ్చు.
45 విభాగాల్లో 2 లక్షలకుపైగా యాప్స్, గేమ్స్‌ను ఈ యాప్‌స్టోర్‌లో పొందుపరిచింది డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే.
ఇన్-యాప్ కొనుగోళ్లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి.
ఇన్–యాప్ బిల్లింగ్ కోసం తమకు నచ్చిన థర్డ్‌పార్టీ పేమెంట్ గేట్‌వేను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.
2025 ఏప్రిల్ 1 వరకు ఇండస్ యాప్ కోసం ఎలాంటి లిస్టింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటున్న డెవలపర్లు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి