06 April 2024
TV9 Telugu
ఈ ఏడాది ఆగస్టు 8న టెస్లా రోబో ట్యాక్సీ ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
తొలిసారిగా రోబో టాక్సీపై మస్క్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రోబో టాక్సీ ఓనర్స్ కార్లను వినియోగించుకోని సమయంలో అద్దెకు ఇచ్చి కొంత డబ్బును సంపాదించేందుకు అవకాశం ఉంది.
ఇందులో కంపెనీ కమిషన్ వసూలు చేస్తుంది. అయితే, రోబోటాక్సీ సర్వీసెస్ మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు టెస్లా చాలా అవాంతరాలు ఎదుర్కొంది.
దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయడానికి టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ రెగ్యులరేటరి ఆమోదం పొందడం ప్రధాన అడ్డంకిగా మారింది.
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ బీటా సాఫ్ట్‌వేర్‌లో సమస్యలను గతేడాది గుర్తించింది. అనేక వాహనాలను రీకాల్ చేసింది. దీంతో రోబో టాక్సీ లాంచ్ డేట్‌ను పొడిగించింది.
టెస్లా కార్లలోని సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా వేగం పరిమితులను ఉల్లంఘిస్తాయని రెగ్యులేటరి హెచ్చరించింది.
దీంతో సమస్యను పరిష్కరించేందుకు టెస్లా కార్లను రీకాల్ చేయాల్సి వచ్చింది. ఇటీవల డ్రైవర్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ తాజా వెర్షన్ ఇటీవల విడుదల చేసింది.
తర్వాతి తరం వెహికిల్ ప్లాట్‌ఫామ్‌లో సరసమైన కారు, డెడికేటెడ్ రోబోటాక్సీ రెండూ ఉంటాయని కంపెనీ తెలిపింది.