బీకేర్‌ఫుల్! ఇక మనిషి కానీ మనిషి వచ్చేసిందోచ్..!
TV9 Telugu
17 October 2024
అక్టోబర్ 11న కాలిఫోర్నియాలోని బర్బ్‌బ్యాంక్‌లో ఆప్టిమస్ జనరేషన్-2 రోబోట్‌ను ప్రవేశపెట్టారు టెస్లా అధినేత ఎలోన్ మస్క్.
ఈ రోబో డ్రింక్స్ తయారు చేయడం నుండి డ్యాన్స్ వరకు, ఈ రోబోట్ మానవుల సూచనల మేరకు అన్ని పనులను చేస్తుంది.
ఇది రెండవ తరం హ్యూమనాయిడ్ రోబోట్. ఇది మునుపటి తరంలో వచ్చిన రోబోలు చేయలేని అనేక పనులను సులభంగా చేయగలదు.
ఈ రోబోట్ మీ కుక్కను నడవడానికి, గడ్డి కోయడానికి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి, పానీయాలు కూడా అందించగలదని వెల్లడించిన మస్క్.
రోబో ప్రత్యక్ష ప్రదర్శన సమయంలో, రోబోట్ కౌంటర్ వద్ద ప్రజలకు పానీయాలు అందించింది. రోబోట్ తలపై టోపీ కూడా ఉంది.
అంతేకాదు కొంతమంది మనుషులతో మాట్లాడటం కూడా కనిపించింది. ఈ రోబోట్ ధర $ 20,000 నుండి $ 30,000 (సుమారు రూ. 16 లక్షల నుండి 25 లక్షలు) మధ్య ఉంటుంది.
ఇంతకుముందు అందుబాటులోకి వచ్చి రోబోట్‌లు నడవడం, మాట్లాడటం మాత్రమే చేసేవి. అయితే కొత్త వెర్షన్ మునుపటి మోడల్‌తో పోలిస్తే చాలా పనులు చేస్తోంది.
డిసెంబర్ 2023లో టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ తాజా వెర్షన్ Optimus Gen 2ని ఆవిష్కరించింది. ఈ రోబోట్ ఇప్పుడు వేగంగా నడవగలదు.
చేతుల వేళ్లపై సెన్సార్లు ఉన్నాయి. తద్వారా ఇది మనుషులను తాకడం. అనుభూతి చెందుతుంది. ఇది కాకుండా రోబోట్‌కు అనేక రకాల నవీకరణలు చేర్చారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి