సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చానప్పటి నుంచి ప్రపంచంలో ఏమూలన ఏం జరిగినా క్షణంలో అరచేతిలో ప్రత్యక్షమవుతోంది.
ఇటీవల యువతను తెగ ఆకట్టుకుంటోంది ఇన్ స్టా రీల్స్. కొందరు తమ ట్యాలెంట్ చూపించుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను తెగ యూజ్ చేసుకుంటున్నారు.
ఇన్‌స్టా రీల్స్ చూసి ఎంజాయ్ చేస్తూ కామెంట్లు, లైక్ ఇచ్చే వారు కొందరైతే.. డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
రీల్స్ పొందాలనుకుంటే ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం.
థర్డ్ పార్టీ యాప్ ద్వారా మోసాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈజీగా రీల్స్ డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది.
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో సేవ్ చేయాలనుకుంటున్న రీల్‌ను ఎంచుకుని.. షేర్ ఐకాన్ పై నొక్కండి.
మెనూలో “యాడ్ రీల్ టు యువర్ స్టోరీ” ని ఎంచుకుని “సేవ్”పై క్లిక్ చేసి తర్వాత స్క్రీన్ పైన ఎడమ మూలలో డిస్కార్డ్ స్టోరీ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవచ్చు.
ఇక స్మార్ట్ ఫోన్ లో ఫైల్ మేనేజర్, గ్యాలరీ అప్లికేషన్‌ల ద్వారా యాక్సెస్ చేసుకుని కావల్సి రీల్స్ చూసుకోవచ్చు.