మీ బ్రౌజింగ్ హిస్టరీ ఎంతవరకు సేఫ్.? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.
13 November 2023
మన ఆన్‌లైన్ జీవితాన్ని, కదలికల్ని, బ్రౌజింగ్ చరిత్రను కొన్ని అదృశ్య నేత్రాలు గమనిస్తూ ఉంటాయి.
ఆ సమాచారం ఆధారంగా గూగుల్, ఫేస్‌బుక్ లాంటివి సొమ్ము చేసుకోవాలని ఆరాటపడతాయి.
అత్యంత ఆత్మీయులకైనా సరే.. కీలకమైన, పూర్తి వ్యక్తిగతమైన సమాచారాన్ని మెయిల్ ద్వారా పంపకపోవడమే మంచిది.
కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయడం సురక్షితం కాదు. ఆయా సంస్థల పోర్టల్‌లోని నంబరుకు మాత్రమే కాల్ చేయాలి.
ఈ - మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్‌కు రెండు దశల ఆథెంటికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
మీ బ్రౌజర్లను దేనికదే విడిగా ఉపయోగించడం ఉత్తమం. ఒక బ్రౌజర్‌ను కేవలం వెబ్ బ్రౌజింగ్‌కు, ఒక బ్రౌజర్‌ను.. బ్యాంకింగ్ వ్యవహారాలకు, మరొకటి సోషల్ మీడియాకు.. ఇలా అన్నమాట.
కుకీస్‌ను మొదట్లోనే నిరోధించండి. బ్రౌజింగ్ హిస్టరీ నిల్వ ఉండకుండా చూసుకోండి.
అది మీ సొంత సిస్టమ్ అయినా సరే, పనైపోగానే సోషల్ మీడియా, ఈ- మెయిల్ ఖాతాల నుంచి లాగ్ అవుట్ కావడం మరిచిపోవద్దు.
సురక్షితమైన బ్రౌజింగ్ కోసం యాంటీవైరస్, యాంటీమాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌ను వాడండి.