C-295 ఎయిర్‌క్రాప్ట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
TV9 Telugu
30 October 2024
భారత వైమానిక దళానికి చెందిన మొదటి రవాణా విమానం C-295. దీని గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం.
ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ ఈ తొలి C-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాప్ట్‌ను సెప్టెంబర్ 13న భారత్‌కు అందజేసింది.
మొత్తం 56 విమానాలు IAFలోకి ప్రవేశించాయి. వాటిల్లో 40 టాటా-ఎయిర్‌బస్ జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశంలో తయారుచేసినవే.
అత్యవసర పరిస్థితులు నెలకొన్న సమయాల్లో సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ C-295 విమానం ఉపయోగం.
5-10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం 71 ట్రూప్ప్‌ను లేదా 50 మంది పారాట్రూపర్‌లను మోసుకెళ్లగలదు.
పెద్ద పెద్ద విమానాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ వెళ్లగలదు.
మిలిటరీ లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే ఉన్నతమైన విమానంగా ఈ సీ-295 ప్రసిద్ధి చెందింది.
ఈ విమానాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్లను వినియోగించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి